శ్రీ రంగం శ్రీనివాసర రావు గారు (శ్రీ శ్రీ )

సాహితీ వ్యాసంగం
శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవాడు.

1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. 1981 లో లండన్‌ లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయంగా ఇలా రాసాడు.

"..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది."

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. ఈ పాటకు గాను ఆయన ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు. రెండవ భార్య సరోజ తో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రిక లో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షిక ను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.

రచనలు
శ్రీశ్రీ రచనల జాబితా ఇక్కడ ఇవ్వబడింది
* ప్రభవ - ప్రచురణ: కవితా సమితి, వైజాగ్ - 1928
* వరం వరం - ప్రచురణ: ప్రతిమా బుక్స్, ఏలూరు - 1946
* సంపంగి తోట - ప్రచురణ: ప్రజా సాహిత్య పరిషత్, తెనాలి - 1947
* మహాప్రస్థానం - ప్రచురణ: నళినీ కుమార్, మచిలీపట్నం - 1950
* మహాప్రస్థానం - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ (20 ముద్రణలు)- 1952-1984 మధ్యకాలంలో
* మహాప్రస్థానం - శ్రీ శ్రీ స్వంత దస్తూరితో, మరియు స్వంత గొంతు ఆడియోతో - లండన్ నుండి - 1981
* అమ్మ - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు సోషలిస్ట్ పబ్లిషర్స్, విజయవాడ - 1952 - 1967
* మేమే - ప్రచురణ: త్రిలింగ పబ్లిషర్స్, విజయవాడ - 1954
* మరో ప్రపంచం - ప్రచురణ: సారధి పబ్లికేషన్స్, సికందరాబాదు - 1954
* రేడియో నాటికలు - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు - 1956
* త్రీ చీర్స్ ఫర్ మాన్ - ప్రచురణ: అభ్యుదయ పబ్లిషర్స్, మద్రాసు - 1956
* చరమ రాత్రి - ప్రచురణ: గుప్తా బ్రదర్స్, వైజాగ్ - 1957
* మానవుడి పాట్లు - ప్రచురణ:విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1958
* సౌదామిని (పురిపండా గేయాలకు ఆంగ్లానువాదం) - ప్రచురణ: అద్దేపల్లి & కో, రాజమండ్రి - 1958
* గురజాడ - ప్రచురణ: మన సాహితి, హైదరాబాదు - 1959
* మూడు యాభైలు - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964
* 1 + 1 = 1 (రేడియో నాటికలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964-1987
* ఖడ్గసృష్టి - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1966-1984
* వ్యూలు, రివ్యూలు - ప్రచురణ: ఎమ్.వీ.ఎల్.మినర్వా ప్రెస్, మఛిలీపట్నం - 1969
* శ్రీశ్రీ సాహిత్యం - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ (5 ముద్రణలు) - 1970
* Sri Sri Miscellany - English volumes - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ - 1970
* లెనిన్ - ప్రచురణ: ప్రగతి ప్రచురణ, మాస్కో - 1971
* రెక్క విప్పిన రివల్యూషన్ - ప్రచురణ:ఉద్యమ సాహితి, కరీంనగర్ - 1971
* వ్యాస క్రీడలు - ప్రచురణ: నవోదయ పబ్లిషర్స్, విజయవాడ - 1980
* మరో మూడు యాభైలు - ప్రచురణ:ఎమ్.ఎస్.కో, సికందరాబాదు - 1974
* చీనా యానం - ప్రచురణ: స్వాతి పబ్లిషర్స్, విజయవాడ - 1980
* మరోప్రస్థానం - ప్రచురణ: విరసం - 1980
* సిప్రాలి - (అమెరికాలో ఫొటోకాపీ) 1981
* పాడవోయి భారతీయుడా (సినిమా పాటలు)- ప్రచురణ:శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు - 1983
* శ్రీ శ్రీ వ్యాసాలు - ప్రచురణ: విరసం - 1986
* New Frontiers - ప్రచురణ: విరసం - 1986
* అనంతం (ఆత్మకథ) - ప్రచురణ: విరసం - 1986

శ్రీశ్రీ తన ఆత్మ కథను అనంతం అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.
* ప్రజ (ప్రశ్నలు జవాబులు) - ప్రచురణ: విరసం - 1990
* తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996
* విశాలాంధ్రలో ప్రజారాజ్యం - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999
* ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
* ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001

ప్రముఖ సినిమా పాటలు

1. మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
2. హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
3. నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)
4. తెలుగువీరలేవరా (అల్లూరి సీతారామరాజు)

ఆయన మహాప్రస్థానం సంపుటిలో రాసిన "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.." అనే పంక్తులు ఆ తరవాత "రుద్రవీణ", "ఠాగూర్" లాంటి సినిమాల్లో వాడబడ్డాయి.

శ్రీశ్రీ పలుకులు
చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ ప్రసిధ్ధి చెందాడు. ఆయన చెణుకులు ఎన్నో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
* ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నాడు: "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా"
* "వ్యక్తికి బహువచనం శక్తి"
* స్నేహితులతో కలిసి మద్రాసు లో హోటలు కెళ్ళాడు. ఒకాయన అట్టు చెప్తానని అన్నాడు. దానికి శ్రీ శ్రీ "అట్లే కానిండు" అన్నాడు.
* తెలుగు కవిత్రయం గురించి తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ.
* తెలుగు లిపి గురించి ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే
అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్చితాభిప్రాయం . ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను. * మహాప్రస్థానం కవితాసంపుటి కి చలం గారు పీఠిక రాశారు. దానికి యోగ్యతాపత్రం అని పేరు. శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, నిజంగానే అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది. అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్ధక నామధేయులంటాను"

శ్రీశ్రీ గురించి ప్రముఖుల పలుకులు
* "మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహా కావ్యం" - పురిపండా అప్పలస్వామి
* "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ" - చలం, యోగ్యతా పత్రంలో
* "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" - పురిపండా అప్పలస్వామి

కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు. విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన స్మారకార్ధం నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

టాలీవుడ్ సెంటిమెంట్ ఇది!!!!!



ఇండస్ట్రీలో సెంటిమెంట్లపై ఉన్న నమ్మకం అంతాఇంతా కాదు. సెంటిమెంట్‌ సూత్రం పాత సినిమాల కాలం నుండి ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే హీరోలకుండే సెంటిమెంటుకు తోడు కొందరు నిర్మాత, దర్శకులకు కూడా సెంటిమెంట్‌ విషయంలో బాగానే పట్టింపులున్నాయని తెలుస్తోంది. 


ఇప్పటి తరం టాలీవుడ్‌ హీరోల సెంటిమెంట్లు ఒక్కసారి పరిశీలిస్తే...నందమూరి నట సింహం, యువరత్న బాలకృష్ణకు తన టైటిల్‌లో సింహం ఉన్నట్లయితే సినిమా సూపర్‌ హిట్‌ అని ఇప్పటికే విడుదలైన చిత్రాలు నిరూపించాయి. లేటెస్ట్‌గా వచ్చిన ‘సింహా’ చిత్రమే ఇందుకు ఉదాహరణ.


ఇక వెంకటేష్‌ కుటుంబ తరహా కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన చిత్రాలు ఆడవారి టైటిల్స్‌తో ఆడేస్తుంటాయి. ఇటీవల ఆ సెంటిమెంట్‌ బలంగా ఉండటంతో లేటెస్ట్‌గా విడుదలయ్యే ‘నాగవల్లి’ చిత్రం మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘లక్ష్మి, ‘తులసి’, చిత్రాలు హిట్‌ రేంజ్‌ ఇమేజ్‌ను సాధించిపెట్టాయి. అందుకే వెంకటేష్‌ రాబోయే తన చిత్రాల టైటిల్స్‌ కూడా ఆడవారి పేర్లు వచ్చేలా చూసుకోవడం విశేషం. 


యువసామ్రాట్‌ నాగార్జునకు డిసెంబర్‌ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందని ఆయన అభిమానుల నమ్మకం. అందుకే తన అభిమానుల కోసం డిసెంబర్‌ నెలలో తన లేటెస్ట్‌ చిత్రం ‘రగడ’ చిత్రం విడుదల చేయనున్నారు.



గతంలో వచ్చిన ‘మాస్‌’, ‘కింగ్‌’ సినిమాలు డిసెంబర్‌లోనే విడుదలవడం విశేషం. ప్రిన్స్‌ మహేష్‌బాబు తన చిత్రాలు మూడు అక్షరాలతో వచ్చేవాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయన బ్లాక్‌బస్టర్‌ చిత్రాలన్నీ కూడా మూడు అక్షరాలతో విజయం సాధించినవే. ‘మురారి’, ‘అతడు’, ‘పోకిరి’, లేటెస్ట్‌గా విడుదలైన ‘ఖలేజా’ ఇవన్నీ మహేష్‌బాబు మూడక్షరాల సెంటిమెంట్‌కు ఉదాహరణలే.

నందమూరి యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు తొమ్మిది సెంటిమెంట్‌ ఎక్కువ. తాను ఏం పని చేసినా తొమ్మిది నంబర్‌ వచ్చేలా చూసుకుంటారట. 

గోపీచంద్‌ సినిమాలు చివర్లో సున్నాతో పూర్తయితే ఆ చిత్రం తప్పక విజయం అని గతంలో కొన్ని చిత్రాలు నిరూపించాయి. ‘యజ్ఞం’, ‘రణం’, ‘శంఖం’లాంటి చిత్రాలు సూపర్‌హిట్‌ను సాధించాయి.


దర్శకులలో కూడా ఈ సెంటిమెంట్‌ బాగానే ఉంది. కోడిరామకృష్ణ తన చిత్రం షూటింగ్‌ జరుగు తున్నంతసేపూ తలకు బ్యాండ్‌ క్లాత్‌ కట్టుకుంటారు. 

సెన్సేషనల్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినిమా పూర్తయ్యేదాకా గడ్డం పెంచుతారు. అలాగే కె.విశ్వనాథ్‌ తన సినిమా పేర్లన్నింటినీ స,శ అక్షరాలతో ప్రారంభం అయ్యేలా చూసుకుంటా రు. 

మణిరత్నం సినిమాలో ఓ వర్షం పాటో...సన్నివేశమో ఉండితీరాలి. నిర్మాతలలో రామానాయుడు తన ప్రతి సినిమాను విజయవాడ దుర్గగుడిలో పూజచేయించడం ఆనవాయితీ. 

నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి తాను తీసే సినిమాలన్నీ ‘అ’ అక్షరంతో మొదలయ్యేలా, భార్గవ్‌ ఆర్ట్‌‌స బ్యానర్‌ కింద వచ్చే సినిమా పేర్లన్నీ ‘మ’ అక్షరంతోనే ఎక్కువగా విజయవంతం కావడం గమనార్హం.

రాజమౌళి అభిమాన హీరోలు ఎవరు?

రాజమౌళి ....ఈ పేరు వింటే తెలుగు కళామతల్లి ఆనందంతో పులకుస్తుంది .ఎందుకంటే ఆయన తీసిన ప్రతి సినిమా ఒక సేన్సేషన్.తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో అద్బుత విజయాలను అందించిన ఈ గ్రేట్ మెగా డైరెక్టర్ ఎవరి అభిమాని అని అందరికి తెలుసుకోవలనిపిస్తుంధీ.ఆంధ్రజ్యోతి టీవీ కి ఇచిన ఇంటర్వ్యూ లో తన మనసోలిని మాటను చెప్పాడు.



ఈ క్రింది వీడియో చుస్తే ఆయన మాటల్లోనే తెలుస్తుంది.

ఆ పాము విలువ పాతిక లక్షలు



విశ్వాసాలు, మూఢవిశ్వాసాలు ఉన్న వారు తమకు కలిసొస్తుందంటే ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. కలిసొస్తుందంటే.. కంపరం పుట్టించే పనులకైనా తాము సిద్ధమే అంటారు. దీనికి సంబంధించిన కథాకమామీషు ఏంటంటే.. రెండు తలల పాముల కోసం ఇండోర్‌కు యాభైఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిిప్లియాఖుర్ద్‌ గ్రామానికి చాలామంది వెళ్తుం టారు. అక్కడి పాములుపట్టేవాళ్లను కలుసుకుని తమకు కావాల్సి న రెండు తలల పాములు లేదా ఇతర జాతుల వివరాలను వారికి చెబుతారు. నర్మదా నది తీర ప్రాంతాలలో ఇటువంటి పాములు కోసం వారు వెతుకుంటారు. కేవలం మధ్యప్రదేశ్‌ నుంచే కాకుం డా మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి ఈ తరహా పాముల కోసం వస్తుంటారు. పాములు పట్టేవాళ్ల దగ్గర వీరు కోరుకున్న జాతుల పాములు ఉంటే ఏదో ఒక ఖరీదుకు కొనుగోలు చేస్తారు. పాముల బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తుంటారు. 

వాటి ఖరీదు సుమారు రూ.5 లక్షల నుంచి ప్రారంభమవు తుంది. ‘3.5 కిలోల బరువున్న పాము ఖరీదు రూ.25 లక్షల వరకు ఉంది. పాముల కోసం వచ్చే వారిలో అధికశాతం తాంత్రికులే ఉంటారు. రెండు త లల పాములను పాతిపెడితే భూగర్భంలో నిధులను కనుగొనవ చ్చని వారి విశ్వాసం’. అరుదైన జాతుల పాములు అంతరించి పో తూన్నాయని అటు జీవకారుణ్య సంస్థలు ఆందోళన చెందుతున్నా యి. అయితే మూఢ విశ్వాసాల పిచ్చిలో పడి కంట పడుతున్న అరుదైన జాతుల పాములను చంపేస్తుండటం బాధాకరము.

ఆసియా క్రీడల్లో మెరిసిన భారత్‌



16వ ఆసియా క్రీడల్లో భారత్‌ మెరిసింది. ఇప్పటి వరకు దేశం పాల్గొన్న ఏషియాడ్‌లలో అత్యధిక పతకాలను ఈ క్రీడల్లో సాధించి అత్యుత్తమ ప్రదర్శనను భారత్‌ నమోదు చేసింది. మొత్తం 64 (స్వర్ణం 14, రజతం 17, కాంస్యం 33) పతకాలు సాధించి 28 ఏళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో సాధించిన 57 (స్వర్ణం 13, రజతం 19, కాంస్యం 25) పతకాల రికార్డును అధిగమించింది. అంతేకాకుండా, పతకాల పట్టికలో ఆరవ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. దీనితో దాదాపు 25 ఏళ్ల క్రితం 1986 సియోల్‌ ఏషియాడ్‌ తరువాత భారత్‌కు అత్యుత్తమ స్థానం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సియోల్‌ ఆసియా క్రీడల్లో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 37 పతకాల్ని సాధించి ఐదవ స్థానాన్ని భారత్‌ సాధించింది. నాలుగేళ్ల క్రితం దోహాలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు 10వ స్థానం లభించింది. ఈ నెల 12న ఘనంగా ప్రారంభమైన ఈ క్రీడల చివరి వారం రోజుల్లో అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, టెన్నిస్‌, రోయింగ్‌ క్రీడాంశాల్లో అథ్లెట్లు రాణించడంతో భారత్‌ అత్యధిక పతకాల్ని సాధించడమే కాకుండా, పూర్తి సంతృప్తితో ఈ క్రీడల్లో పోరాటాన్ని ముగించింది. మొత్తం మీద భారత్‌ ఆయా క్రీడాంశాల విషయానికి వస్తే, అథ్లెటిక్స్‌లో 5, బాక్సింగ్‌, టెన్నిస్‌ల్లో చెరో రెండు, కబడ్డీలో మరో రెండు స్వర్ణ పతకాలు భారత్‌కు లభించాయి. ఈ క్రీడల్లో బిలియర్డ్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ పంకజ్‌ అద్వాని దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టగా, వరల్డ్‌ నంబర్‌1 బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ 14వ స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో వేశాడు.

అద్వాని నుంచి విజేందర్‌ దాకా...
ఈ క్రీడల్లోని కొన్ని క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పంకజ్‌ అద్వాని అందరు అనుకున్నట్లుగానే స్వర్ణాన్ని నెగ్గి తన హోదాను కాపాడుకోవడంతో పాటు దేశానికి తొలి స్వర్ణాన్ని అందించగా, షాట్‌గన్‌ షూటర్‌ సోధి పురుషుల డబుల్‌ ట్రాప్‌ ఈవెం ట్లో రెండో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. అనంతరం రో యింగ్‌ బరిలోకి దిగిన థక్క ర్‌ దేశానికి మూడో స్వర్ణాన్ని సాధించాడు. సొంత బోట్లు లేక అద్దెకు తెచ్చుకున్న బోట్లతో మరో భారత ఆటగాడు బజరంగ్‌లాల్‌ థక్కర్‌ రోయింగ్‌లో తొలి పసిడి పతకాన్ని సాధించి చరిత్ర పుటలకెక్కాడు. 

టెన్నిస్‌లో టాప్‌సీడ్‌ సోమ్‌దేవ్‌ అద్భుతమైన ఆట తీరుతో పురుషుల సింగిల్స్‌తో పాటు, డబుల్స్‌ విభాగంలో లో భారత్‌కు రెండు స్వర్ణాల్ని అందించాడు. స్టార్‌ బాక్సర్‌ విజేం దర్‌ సింగ్‌ (75 కేజీలు) భారత్‌కు ఈ క్రీడల్లో చివరి స్వర్ణాన్ని అందించాడు. మరో యువ బాక్సర్‌ వికా స్‌ కృష్ణన్‌ (60 కేజీలు) కూడా తన ప్రత్యర్థిని ఓడిం చి పసిడిని కైవసం చేసుకున్నాడు. భారత పురుషుల కబడ్డీ జట్టు వరుసగా ఆరవసారి స్వర్ణాన్ని సాధించి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాను కాపాడుకోగా, తొలిసారి ఈ క్రీడల బరిలోకి దిగిన మహిళల కబడ్డీ జట్టు స్వర్ణంతో బోణీ చేసింది. పురుషుల ఫైనల్స్‌లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇరాన్‌ జట్టును భారత్‌ ఓడించగా మహిళల ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌పై భారత మహిళల జట్టు విజయం సాధించింది. 

అథ్లెటిక్స్‌లో కర్ణాటకకు చెందిన అశ్విని అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ 400 మీటర్ల హర్డిల్స్‌, 4/400 మీటర్ల రిలేలో రెండు స్వర్ణ పతకాలను నెగ్గి రికార్డు సృష్టించింది. అంతకుముందు మహిళా అథ్లెట్లు ప్రీజా శ్రీధరన్‌ (3 వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌), సుధా సింగ్‌ (10 వేల మీటర్లు) రెండు స్వర్ణాలను సాధించి శుభారంభాన్ని ఇచ్చారు. అనంతరం పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కేరళకు చెందిన జోసెఫ్‌ అబ్రహాం 28 ఏళ్ల తరువాత దేశానికి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లో పసిడి పతకాన్ని సాధించిపెట్టాడు. గతంలో 1982లో స్వదేశంలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన చార్లెస్‌ బొరోమియా 800 మీటర్ల పరుగు పందెంలో దేశానికి పతకాన్ని సాధించిపెట్టాడు. మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దేశానికి కాంస్య పతకాల్ని సాధించిపెట్టింది. ఆర్చరీలో భారత ఆటగాడు తరుణ్‌దీప్‌ రాయ్‌ అద్భుత ప్రతిభ కారణంగా వ్యకిగత విభాగంలో తొలి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. 

చైనాలో పెరుగుతున్న క్రెడిట్‌ కార్డు నేరాలు



క్రెడిట్‌ కార్డ్‌ రంగంలో పెరుగుతున్న వసూలు కాని రుణాలు వల్ల తలెత్తున్న ఇబ్బందుల పట్ల జాగ్రత్త వహించాలని వాణిజ్య బాంకులను చైనా రిజ ర్వ్‌ బాంకు హెచ్చరించింది. 

చైనాలో క్రెడిట్‌కార్డ్‌ రుణాలు 1.19 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరు కుంది. 

ఈ త్రైమాసికం చివరికి క్రెడిట్‌ కార్డ్‌ రుణం గత 180 రోజులకాలానికి 7.92 బిలియన్‌ యువాన్‌, (అంటే 1.19 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు)గా నమో దైందని పీపుల్స్‌ బాంక్‌ ఆఫ్‌ చైనా ఒక ప్రకట నలో పేర్కొంది. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని, క్రెడిట్‌ కార్డు సంబంధిత మొండి బాకీలు విషయంలో తలెత్తే ఇబ్బందులను జాగ్రత్తగా గమనించమని వాణిజ్య బాంకులకు పిబిసి సూచించింది.

చైనాలో ఆర్థిక వ్యవస్థను కాపాడడం కోసం బ్యాంకు కార్డులకు సంబంధించిన నేరాలను అరికట్టడం కోసం చైనా పోలీసు శాఖ కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. 

ఈ ఏడాది జనవరి-అక్టోబరు మధ్యకాలంలో బ్యాంకు కార్డుకు సంబంధించిన 19,000 కేసులను పరిష్కరించి చైనా పోలీసు శాఖ 600 మిలి యన్ల యుఆన్‌(అంటే 90 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) నిధులను కైవసం చేసుకుందని పబ్లిక్‌ ెసెక్యూరిటీ మంత్రిత్వ శాఖ తెలియజేస్తోంది. 

దేశవ్యాప్తంగా బ్యాంక్‌ కార్డు సంబంధిత నేరాలపై ఈ ఏడాది జనవరి నెల మొదులుకుని ఈ మంత్రిత్వ శాఖ, పిబిసి సంయుక్తంగా ప్రచారం చేస్తు న్నాయి. అప్పటినుంచి క్రమంగా క్రెడిట్‌ కార్డ్‌ వ్యవహారలు నడుపుతున్న 1,000పైగా ముఠాలను పట్టుకున్నారు. 2010 అర్థసంవత్సరం కాలంలో జారీ చేసిన బ్యాంకు కార్డుల సంఖ్య 2.1 బిలియనుకు చేరుకుందని చైనా బాంకింగ్‌ కార్డు పరిశ్రమ వారి సంస్థ చైనా యూనియన్‌ పే విడు దల చేసిన గణాంకాలు వివరిస్తున్నాయి. 

జగన్ మాయావతి, శరద్ పవార్‌తో... మంతనాలు సాగిస్తున్నాడా?

తాను అవమానకర పరిస్థితిలో నిష్ర్కమించేందుకు కారణమైన కాంగ్రెస్‌ నాయకత్వంపై వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. తాను లేని కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఎలా మనుగడ సాగిస్తుందో నాయకత్వానికి అనుభవపూర్వకంగా చాటి చెప్పనున్నారు. రాష్ట్రంలో జీవచ్ఛవంలా పడిఉన్న కాంగ్రెస్‌కు ప్రాణాలకు సైతం తెగించి జీవం పోయడమే కాకుండా, రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి సేవలను తృణప్రాయంగా పక్కకుపెట్టి, తన కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్‌ నాయకత్వానికి జాతీయ స్థాయిలోనే తిరుగులేని గుణపాఠం చెప్పాలని వైఎస్‌ జగన్‌ కృత నిశ్చయంతో ఉన్నారు.

అందుకు యుపిఏ సర్కారులోని భాగస్వామ్యపార్టీల్లో సోనియా వైఖరి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న పెద్ద పార్టీలతో మంతనాలు జరిపి, వారిని కాంగ్రెస్‌ నుంచి వేరు చేయాలన్న వ్యూహంతో జగన్‌ ఢిల్లీపై దృష్టి పెట్టారు. ప్రధానంగా.. యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తీరుపై అసంతృప్తితో ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్‌ అధ్యక్షుడు శరద్‌పవార్‌, బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతితో మంతనాలు ప్రారంభించినట్లు జగన్‌ వర్గీయుల సమాచారం.
Pawar-32జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంతో పీకల్లోతు కష్టాలతో కూడుకుపోయిన కాంగ్రె స్‌ నాయకత్వానికి తాజాగా బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎదురయిన ఘోర పరాభవం నైతికంగా దెబ్బతీసింది. కాబోయే ప్రధానిగా ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ ప్రచారం చేసినా, గతంలో కంటే ఇంకా తక్కవ స్థానాలే దక్కడం నాయకత్వం అవమానంగా భావిస్తోంది. అంతర్గతంగా కూడా యుపిఏ భాగస్వామ్య పక్షాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దేశవ్యాప్తంగా తనకు మళ్లీ ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న ఆందోళనతో ఉన్న పార్టీకి తాజాగా ఆంధ్రలో జగన్‌ వ్యవహారం వజ్రాఘాతంలా పరిణమించింది.

ఈ పరిణామాలను సద్వినియోగం చేసుకుని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని జగన్‌ నిర్ణయించుకు న్నారు. అందులో భాగంగా.. ఆయన శరద్‌పవార్‌, మాయా వతితో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. తన వద్ద ఉన్న సంపదను కాంగ్రెస్‌ పతనానికి వినియోగించాలన్న భావన ఆయనలో కనిపిస్తోంది. బీఎస్‌పి, ఎన్సీపీతో పాటు కొన్ని చిన్న చితకా పార్టీలను యుపిఏకు మద్దతు ఉపసంహరింపచేసి, దాని ద్వారా వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ముందే అంతా ఒక కూటమిగా ఏర్పడి, కాంగ్రెస్‌ను చావుదెబ్బతీయాలన్నది జగన్‌ లక్ష్యమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తన తండ్రికి సన్నిహితుడయిన శరద్‌పవార్‌ సలహా కోసం జగన్‌ త్వరలో ఆయనను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ద్వారా మాయావతి, ఇతర ప్రాంతీయ పార్టీ నేతలతో చర్చలు జరపాలన్నది జగన్‌ వ్యూహమంటున్నారు. వీలుంటే అన్నాడిఎంకె అధినేత్రి జయలలితతో కూడా చర్చించాలన్నది జగన్‌ అభిమతమని చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరిగే జగన్‌ ఢిల్లీ యాత్రలో ప్రధాన అజెండా ఇదేనని ఆయన వర్గీయులు వివరిస్తున్నారు.